Wednesday, January 22, 2025

వరుసగా నాలుగోరోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

- Advertisement -
- Advertisement -

Petrol Price hike 89 Paise for 4th Day 

న్యూఢిల్లీ: వరుసగా నాలుగో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై, 89 పైసలు, లీటర్ డీజిల్ పై 86 పైసలు పెరిగాయి. ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని గత ఏడాది నవంబర్ 4వ తేదీ నుంచి నిలిచిపోయిన పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల మళ్లీ నాలుగు రోజుల క్రితం మొదలైంది. తాజా పెంపుదలతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.80, లీటర్ డీజిల్ ధర 98.10కు చేరుకుంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.113.60, లీటర్ డీజిల్ ధర 99.56కు చేరుకుంది. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.97.81 ఉండగా డీజిల్ ధర రూ.89.07 చేరుకుంది. 2017 జూన్‌లో రోజు వారీ పెట్రోల్, డీజిల్ ధరల సమీక్ష అమలులోకి వచ్చిన తర్వాత ఇంత హెచ్చు స్థాయిలో ధరల పెంపు ఉండడం ఇదే మొదటిసారి.

Petrol Price hike 89 Paise for 4th Day 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News