అమరావతి: చిత్తూరు జిల్లాలోని భాకరాపేట వద్ద ఘాట్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సు లోయలో పడిన ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్,మహిళ, చిన్నారి సహా 8 మంది మృతి చెందారు. పెళ్లి నిశ్చితార్థానికి వరుడు, బంధువులు వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో పెళ్లి కుమారుడు సహా 44 మందికి గాయాలయ్యాయి. 31 మంది క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్విమ్స్ ఏడుగురు, బర్డ్ ఆస్పత్రిలో మరో ఆరుగురు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. బస్సు బోల్తా ఘటనలో ఆరుగురు ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి, మరో వ్యక్తి మృతి చెందాడు. మృతులను వెంగప్ప(60), మురళి(45),కాంతమ్మ(40), మలిశెట్టి గణేశ్(40) డ్రైవర్ నబీ రసూల్, క్లీనర్, యశస్విని(8) ఆదినారాయణరెడ్డిగా గుర్తించారు. నిన్న మధ్యాహ్నం ధర్మవరం బయలు దేరిన బస్సు రాత్రి భాకరాపేట వద్ద 100 అడుగుల లోయలో పడింది. తిరుచానూరులో జరగాల్సిన నిశ్చితార్థానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సు అతివేగమే ప్రమాదానికి కారమణి బాధితులు ఆరోపిస్తున్నారు. స్థానికుల సమచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
లోయలో పడిన బస్సు: చిన్నారి సహా 8 మంది మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -