బీహార్ కౌన్సెలింగ్ సెంటర్ తీర్పు
పాట్నా : ఇరువురు భార్యల వ్యాజ్యంపై బీహార్‌లోని కుటుంబ సమస్యల పరిష్కార కేంద్రం విచిత్ర సలహాను వెలువరించింది. రెండు పెళ్లిళ్ల భర్త ఇద్దరు భార్యలకు తగు సమయం కేటాయించాలి. వారికి సముచిత సాయం అందించాలని తీర్పు చెప్పింది. కుటుంబ తగాదాలను తీర్చే ఈ కౌన్సెలింగ్ సెంటర్ ఎదుటికి గోడియారి నివాసి అయిన ఓ మహిళ తన సమస్యను తీసుకువెళ్లింది. తన భర్తకు ముందే పెళ్లయిందని, ఆరుగురు పిల్లలున్నారని, ఈ నిజం తెలియచేయకుండా తన మెడలో తాళి కట్టాడని తరువాత తెలిసి తన వెత విచిత్రం అయిందన్నారు. విషయం బయటకు రాకుండా తనను మాయ చేశాడని వాపోయింది. ఆరుగురు పిల్లల తండ్రితో తాను కాపురం చేయడం కుదరదని తెలిపింది. ఇద్దరు భార్యల వాదనలను విన్న తరువాత కౌన్సెలింగ్ సెంటర్ నిర్వాహకులు అత్యద్భుతపు తీర్పు చెప్పారు. భర్త ఇద్దరు భార్యలను వేర్వేరు ఇళ్లలో ఉంచాలి. వారికి వేర్వేరు సమయాలు తగువిధంగా కేటాయించాలని, వారికి అయ్యే వ్యయం సమంగా భరించాలని భర్తగా ఇది ఆయనకు జంట బాధ్యత అని తేల్చిచెప్పారు.