- Advertisement -
న్యూఢిల్లీ : ప్రముఖ ప్రయాణ సేవల సంస్థ యాత్రా ఆన్‌లైన్‌లిమిటెడ్ ఐపిఓకు దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు సెబికి ముసాయిదా పత్రాలను సమర్పించింది. రూ.750 కోట్లు విలువ చేసే తాజాషేర్లతో పాటుగా 93,28,358 ఈక్విటీ షేర్లు ఫర్ ఫర్ సేల్ కింద అందుబాటులో ఉంచనుంది. వ్యూహాత్మక పెట్టుబడులు, కొనుగోళ్లు, సంస్థ విస్తరణ కార్యకలాపాల కోసం ఐపిఓ నిధులను వినియోగించనుంది. ఎస్‌బిఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్, డిఎఎం క్యాపిటల్ అడ్వైజర్స్ లిమిటెడ్,ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్‌లిమిటెడ్ లీడ్ మేనేజర్లుగా ఉన్నాయి.యాత్రా ఆన్‌లైన్ లెమిటెడ్ మాతృసంస్థ ‘ యాత్రా ఆన్‌లైన్‌ఐఎన్‌సి’ఇప్పటికే అమెరికాలోని నాస్‌డాక్ ఎక్స్‌చేంజిలో లిస్టయింది.
- Advertisement -