Monday, December 23, 2024

కార్పొరేట్ కంపెనీల లాభాల కోసమే మందుల ధరల పెంపు

- Advertisement -
- Advertisement -

కేంద్రం తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: తమ్మినేని వీరభద్రం

Drug prices increases for corporate companies

 

మన తెలంగాణ/హైదరాబాద్: 850 రకాల మందుల రేట్లను భారీగా పెంచుకోవడానికి కేంద్ర బిజెపి ప్రభుత్వం మందుల తయారీ కంపెనీలకు అనుమతి ఇచ్చిందని.. పేద, మధ్యతరగతి ప్రజలపై పెద్ద ఎత్తున భారం వేస్తూ, కార్పొరేట్ కంపెనీలకు లాభాలు కట్టబెట్టడమేనని.. తక్షణమే మందుల ధర పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. రోగులు వాడే మందులపై 2019లో 2 శాతం, 2020లో 0.5 శాతం మాత్రమే ధరలు పెంచుకోవడానికి అవకాశమిచ్చిన కేంద్రం ఏప్రిల్ 1 నుండి మామూలు జ్వరానికి వాడే మందు బిల్లలతో పాటు.. బిపి.ష/గర్, గుండెజబ్బులు తదితర అత్యవసరానికి వాడే మందులతో పాటు 850 రకాల మందులపై 11 శాతం రేట్లు పెంచుకోవడానికి ఆయా కార్పొరేట్ కంపెనీలకు అనుమతినిచ్చిందన్నారు.

ఇది సరైంది కాదని తెలిపారు. ఇప్పటికే పేద, మధ్య తరగతి కుటుంబాలకు వైద్యం అందని దాక్షలా వుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్, ప్రెటోల్, డీజిల్, నూనెలు, విద్యుత్ బిల్లులతో పాటు, నిత్యావసరాల ధరలను భారీగా పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం మందుల ధరల కూడా పెంచడం ప్రజలపై మరింత భారం వేయడమేనన్నారు. కరోనా సంక్షోభ సమయంలో కూడా ప్రజలు, ప్రభుత్వాల ఆదాయం పడిపోయినప్పటికీ కార్పొరేట్ మందుల కంపెనీలు ఆసుపత్రుల యజమానులు మాత్రం కుబేరులయ్యారని ఆయన తెలిపారు.

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల బిపి, షుగర్, గుండెజబ్బులు తదితర మందులు రెగ్యులర్‌గా వాడే పేదలు వైద్యానికి దూరమవుతారన్నారు. తక్షణమే మందుల ధరల పెంపుపై తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని, ప్రజలకు మందుల ధరల పెంపుపై తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని, ప్రజలకు మందుల ధరల అందుబాటులో ఉండే విధంగా చూడాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News