Monday, December 23, 2024

చట్టం ప్రకారమే అమరావతి ఏర్పాటు..

- Advertisement -
- Advertisement -

ఇప్పుడు మారుస్తామంటే కుదరదు: ఢిల్లీలో టిడిపి ఎంపిలు

TDP

మన తెలంగాణ/హైదరాబాద్: ఎపి ప్రభుత్వంపై టీడీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఢిల్లీలో వారు మీడియాతో మాట్లాడుతూ.. చట్టాలు చేసే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉందని, చట్టాల ప్రకారమే పునర్విభజన చట్టం ఇప్పటికే అమలు చేశారని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. దీని ప్రకారమే ఏపీ రాజధానిగా అమరావతి ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వమే చట్టాన్ని పార్లమెంట్‌లో ఆమోదించిందని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని మారుస్తామంటే కుదరదని, న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని కనకమేడల హెచ్చరించారు. కొంద్రు జడ్జిలను కూడా బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పులపై సభలో వక్రభాష్యాలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించకూడదన్నారు. ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో అప్పులు తెచ్చి పథకాలు అమలు చేస్తున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎద్దేవా చేశారు. కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు ఫించన్లు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం ఆదాయం లేదని ఆరోపించారు. సంపదను సృష్టించే ఆలోచన కూడా జగన్‌కు లేదని రామ్మోహన్ నాయుడు దుయ్యబట్టారు. పన్నులను విపరీతంగా పెంచేశారని ఆయన చెప్పారు. డ్రైనేజీ, చెత్త మీద కూడా పన్నులు వేస్తున్నారంటూ ఆగ్రహం చెందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News