Monday, December 23, 2024

‘కృష్ణ వ్రింద విహారి’ టీజర్ వచ్చేసింది…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో నాగ శౌర్య నటిస్తున్న తాజా సినిమా ‘కృష్ణ వ్రింద విహారి’. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోంది. నాగశౌర్య తొలిసారి బ్రాహ్మణ యువకుడిగా నటిస్తున్నాడు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో శౌర్యకు జోడీగా షిర్లీ సెటియా కథాయికగా నటిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ మూవీ టీజర్ ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో అలనాటి నటి రాధిక ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ స్వరాలు సమకూరుస్తుండగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ మూవీ వేసవి కానుకగా ఏప్రిల్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Krishna Vrinda Vihari Movie Teaser Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News