Saturday, November 23, 2024

అరుదైన లివర్ ట్యూమర్ కు విజయవంతంగా కామినేని వైద్యుల సర్జరీ..

- Advertisement -
- Advertisement -

Kamineni Doctors Surgery Successful to Rare Liver Tumor

విజయవాడ: కాలేయం ఎడమ భాగంలో హెపాటిక్ అడెనోమాతో బాధపడుతున్న 45 ఏళ్ళ డయాబెటిక్, హైపర్ టెన్సివ్ రోగికి కామినేని హాస్పిటల్ (విజయవాడ) వైద్యులు విజయవంతంగా చికిత్స చేయగలిగారు. హెపాటిక్ అడెనోమా అనేది ఎంతగానో అరుదైన కాలేయ ట్యూమర్. అది ప్రాణాంతక ట్యూమర్ గా మారే అవకాశం కూడా ఉంది. ఈ కాలేయ ట్యూమర్ నే హెపటోసెల్యులర్ అడెనొమా లేదా లివర్ సెల్ అడెనొమా అని కూడా వ్యవహరిస్తారు. సాధారణంగా ఇది మహిళలను బాగా ప్రభావితం చేస్తుంది. కుటుంబ నియం త్రణ మాత్రలతో ముడిపడి ఉన్నట్లుగా చెబుతారు. చాలా సందర్భాల్లో హెపాటిక్ అడెనోమా ఎలాంటి లక్షణా లను కనబర్చదు. కొన్ని సందర్భాల్లో మాత్రం నొప్పి, వికారం లేదా కడుపు నిండా ఉన్న భావన లాంటివి కలుగుతాయి. గడ్డ బాగా పెద్దదిగా ఉన్న సందర్భాల్లో, అది పక్కనే ఉన్న ఇతర అవయవాలు, కణజాలాల పై ఒత్తిడిని కలిగించినప్పుడు ఇలాంటివి చోటు చేసుకుంటూ ఉంటాయి. విజయవాడ నివాసి అయిన శ్రీ రామాంజనేయులు ను సాధారణ ఆరోగ్య తనిఖీ కోసం కామినేని హాస్పిట ల్స్ కు తీసుకువచ్చారు. పొత్తికడుపు అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ లో ఆయన హెపాటిక్ అడెనోమాతో బాధపడు తున్నట్లుగా గుర్తించారు. కాలేయం ఎడమ భాగంలో 7.5x7x5.6 సెం.మీ. పరిమాణంలో ట్యూమర్ ఉన్న ట్లుగా గుర్తించారు. ఈ పరిమాణంలో ఉండే హెపాటిక్ అడెనోమా ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. దాంతో సర్జరీ చేయించుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. అది పెద్ద సర్జరీ కావడంతో ఆయనను కార్డి యాక్ పరీక్షలకు కూడా పంపించారు. పాజిటివ్ టీఎంటీ కారణంగా యాంజియోగ్రఫీ కూడా చేయించు కున్నారు. రిస్క్ తో ముడిపడిన సర్జరీ చేయించుకోవచ్చునని కార్డియాలజిస్టు సూచించారు.

ఈ సందర్భంగా రామాంజనేయులుగారు మాట్లాడుతూ ‘‘ట్రీట్ మెంట్ చక్కగా జరిగింది. డాక్టర్లు నా పట్ల ప్రదర్శించిన స్నేహపూర్వక వైఖరి ఎంతో బాగుంది. సర్జరీ మొదటి దశలో ప్రొసీజర్ గురించి నాకు చక్కగా వివరించారు. తద్వారా నా మానసిక ఆరోగ్యాన్ని కుదుటపర్చుకునేందుకు తోడ్పడ్డారు. కామినేని ఆసు పత్రిలో డాక్టర్లతో చక్కటి అనుభవం పొందాను’’ అని అన్నారు.ఈ సందర్భంగా డైరెక్టర్, హెపటోబిలియరీ సర్జరీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రాజశేఖర్ పెరుమాళ్ల, కన్స ల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలిజస్ట్ డాక్టర్ వెలినేని శ్రీ వేంకట పవనేశ్వర్ మాట్లాడుతూ, ‘‘ ట్యూమర్, వాస్క్యులర్ క్రమరాహిత్యాలను గుర్తించేందుకు గాను సర్జరీకి ముందుగా ట్రైఫేసిక్ సీటీ అబ్డోమెన్ నిర్వహించాం. ఎడమ హెపాటిక్ ఆర్టెరీ రీప్లేస్ అయినట్లుగా అందులో తేలింది. రక్తం పెద్దగా కోల్పోకుండానే, ఆయన లెఫ్ట్ హెపటెక్టమీ చేయించుకున్నారు’’ అని అన్నారు. ‘‘సర్జరీ తరువాత ఎలాంటి ఇబ్బందులు లేకుండానే కోలుకున్నారు. నెఫ్రాలజిస్టు, ఫిజీషియన్ రోగి రెనల్, గ్లైకెమిక్ స్థాయిలను ఎప్పటికప్పుడు పరిశీలించారు. ఆ ట్యూమర్ హెపాటిక్ అడెనొమా అని బయాప్సీ ధ్రువీకరించింది’’ అని డాక్టర్ రాజశేఖర్ పెరుమాళ్ల అన్నారు.

Kamineni Doctors Surgery Successful to Rare Liver Tumor

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News