Monday, December 23, 2024

74 మంది ప్రముఖులకు పద్మ అవార్డుల ప్రదానం

- Advertisement -
- Advertisement -

Awarding of Padma Awards to 74 celebrities

 

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం సోమవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకుడు దివంగత కల్యాణ్ సింగ్‌కు మరణానంతరం, నటుడు విక్టర్ బెనర్జీతోపాటు 74 మంది ప్రముఖులకు పద్మ అవార్డుల ప్రదానం జరిగింది. ఈ ఏడాది మొత్తం 128 మంది ప్రముఖులను పద్మ అవార్డులు వరించగా తొలి దశగా మార్చి 21న 54 మందికి అవార్డుల ప్రదానం జరిగింది. సోమవారం రెండో విడతగా పద్మ విభూషణ్ అవార్డులు స్వీకరించిన వారిలో ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్(మరణానంతరం), సంగీత విద్వాంసురాలు ప్రభా ఆత్రే ఉన్నారు. పద భూషణ్ స్వీకర్తలలో నటుడు విక్టర్ బెనర్జీ, కరోనా వ్యాక్సిన్ కోవ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్‌కు చెందిన కృష్ణమూర్తి ఎల్లా, సుచిత్రా ఎల్లా ఉన్నారు. పద్మ అవార్డులను పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీలుగా మూడు విభాగాలుగా అందచేస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News