Saturday, November 16, 2024

పగలు ‘సెగలు’

- Advertisement -
- Advertisement -

Daytime temperatures are likely to rise by three to five degrees

పగటి ఉష్ణోగ్రతలు మూడు నుంచి ఐదు డిగ్రీలు పెరిగే అవకాశం
ప్రజలు అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ బయటకు రావొద్దు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక సూచన చేసింది. వచ్చే ఐదురోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. సుమారు మూడు నుంచి ఐదు డిగ్రీల పాటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం, భానుడి ప్రతాపం తీవ్రతరం కావటంతో ఏప్రిల్, మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం

మరోవైపు రాగల మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ బయటకు రావొద్దని అధికారులు సూచించారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు వడదెబ్బల బారిన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా మరోవైపు విదర్భ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉపరితల ద్రోణి విదర్భ నుంచి ఇంటీరియల్ కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు సముద్రమట్టం నుంచి దాదాపు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News