Saturday, November 23, 2024

విద్యుత్ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర

- Advertisement -
- Advertisement -

విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య

Central conspiracy to weaken power companies

మన తెలంగాణ,సిటీబ్యూరో: దేశ వ్యాప్తంగా ఉన్న విద్యుత్ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విదానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాల ఫోరం ఆధ్వర్యంలో జరిగిన“ భారత బంద్‌” కార్యాక్రమంలో భాగంగా విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ మింట్ కంపౌండ్‌లో ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అంజయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ విధానాలు, కార్మికులు, రైతులు , ఉద్యోగులు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయన్నారు.అంతే కాకుండా విద్యుత్ సంస్థలను ప్రైవేట్ పరం చేసి కోట్లాది రూపాయాలను బడాబాబులకు కట్టబెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న చట్టాలన్నీ నల్లచట్టాలనే అసోసియేషన్ ఉపాద్యక్షుడు నాసర్ షరీఫ్ అన్నారు. విద్యుత్ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం ద్వారా అన్ని వర్గాల ప్రజల ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యాలయాల ముందు మంగళవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పరమేష్, అనిల్, అనురాధ, కొరడాల వెంకటేశ్వర్లు,వీర స్వామి,అంజనేయులు, వెంకటేశ్వర్లు,మహేందర్ రెడ్డి, మురళయ్య,సత్యనారాయణ, ప్రసాద్, రమ్మశ్రీ జానకి,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News