Tuesday, December 3, 2024

సరైన నిద్ర ఉంటే శారీరక, మానసికంగా ఆరోగ్యం లభిస్తుంది

- Advertisement -
- Advertisement -

Sleep Deprivation

మన తెలంగాణ,సిటీబ్యూరో: నిద్ర అన్నది బలహీనులకు మాత్రమే అని కేరీర్‌పై దృష్టిసారించిన వ్యక్తి గతంలో ఓసారి అన్నారు. దురదృష్టవశాత్తు చాలామంది ఆమాటను నిజమని నమ్మని చక్కని నిద్రను విస్మరించారు. అర్థరాత్రి దాటిన తరువాత పడుకోవడం, తెల్లవారక ముందే మేల్కోవడం అలవాటుగా మారింది. మహమ్మారి అనంతర కాలంలోను అదే దోరణి కొనసాగుతోంది. అదృష్టవశాత్తూ రాత్రివేళ మంచి చక్కని నిద్ర అవసరమని ఇటీవల కాలంలో కొన్ని అధ్యయనాలు నొక్కి చెప్పాయి. సరైన నిద్ర ఉంటే చక్కని శారీరక, మానసిక, భావోద్వేగ ఆరోగ్యం కలిగి ఉంటారని, మంచి నిద్ర రావడమనేది నేడు సవాల్‌గా మారిందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

ఇటీవల రెస్‌మెడ్ ఒక నిద్ర అధ్యయనాన్ని నిర్వహించి 5వేల మందిని ప్రశ్నించింది. చాలామంది బారతీయులు మంచి రాత్రి నిద్ర అందరికి అవసరమని విశ్వస్తిస్తున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 81శాతం మంది నిద్ర చక్రం వారి జీవన నాణ్యతను ప్రభావితం చేస్తుందని అభిప్రాయపడ్డారు. భారతీయులు నిద్రపోవడానికి ఎక్కువ సమయం(సగటు సమయం సుమారు 90 నిమిషాలు) తీసుకుంటారని,దీనికి అనేక కారణాలు ఉండవచ్చని, అందులో ఒత్తిడి, నిద్రపోయే ముందు స్క్రీన్ సమయం, సహా అనేక ఇతర కారణాలుండవచ్చున్నారు. 59శాతం మంది గురకను మంచినిద్రకు చిహ్నంగా భావిస్తున్నట్లు, అబ్‌స్ట్రక్ట్రివ్ స్లీప్ అప్నియా గురించిన పరిజ్ఞాన లేమిని ఇది తెలియజేస్తోందని చెప్పారు. నిద్రను మెరుగుపరచడానికి వ్యక్తిగత ఉత్పత్తులు అన్నీ అభివృద్ది పరిచినా మీకు ఏది సరిగ్గా పనిచేస్తుందో చూడటానికి నిద్ర నిపుణుడితో మాట్లాడటం మంచిదంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News