పుస్తకాన్ని రచించిన కంభంపాటి రామ్మోహన్ రావు
40 ఏళ్ల టిడిపి ప్రస్థానంపై పుస్తకం
కార్యక్రమానికి హాజరైన వివిధ రంగాల ప్రముఖులు
మన తెలంగాణ/హైదరాబాద్ : టిడిపి సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు రచించిన ’నేను -తెలుగుదేశం’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం హైదరాబాదులో జరిగింది. 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ప్రస్థానాన్ని ఈ పుస్తకంలో వివరించారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.కాగా, తన పుస్తకంపై కంభంపాటి రామ్మోహన్ రావు స్పందిస్తూ… ఈ పుస్తకం కోసం రెండేళ్లు హోమ్ వర్క్ చేశానని వెల్లడించారు. ఎన్‌టిఆర్ ఏది చెబితే అది చేయడమే తనకు తెలుసు అని వివరించారు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని కొనియాడారు. కాగా, ఈ పుస్తకావిష్కరణ సభలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, టిడిపి సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు,చింతకాయల అయ్యన్నపాత్రుడు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పయ్యావుల కేశవ్, మురళీమోహన్, రాఘవేంద్రరావు, అశ్వనీదత్, టిఆర్‌ఎస్ నాయకుడు తుమ్మల నాగేశ్వరావు, సిపిఐ నారాయణ, శ్రీనివాస్ రెడ్డి, రామచంద్ర మూర్తి , నన్నూరి నర్సిరెడ్డి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు