Monday, December 23, 2024

వ్యాఖ్యాత చెంప చెళ్లుమనిపించిన విల్ స్మిత్

- Advertisement -
- Advertisement -

ఆస్కార్ అవార్డుల వేడుకలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఆనందం..భావోద్వేగాల మధ్య సాగే ఈ వేడకలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తొలుత ఇదంతా సరదాగా జరుగుతోన్న ఓ ప్రాంక్ లాంటి సన్నివేశం అనుకుని అంతా పొరబడ్డారు. ఆ తర్వాతే అర్ధమైంది అది గొడవ అని. వివరాల్లోకి వెళ్తే… అవార్డుల వేదికపై అమెరికా కమేడియన్ క్రిస్ రాక్ వ్యాఖ్యతగా వ్యవహరించి వీక్షకుల్ని నవ్వుల్లో ముంచెందుకు ఓ కామెడీ ట్రాక్ చెప్పుకొచ్చారు. ఇందులో ప్రముఖ నటుడు విల్ స్మిత్ సతీమణి జాడా పింకెట్ ప్రస్తావన తీసుకొచ్చాడు. జుట్టు పూర్తిగా తొలగించుకొని వేడుకకు హాజరైన ఆమెను ‘జీ ఐ. జేన్’ చిత్రంలో డెమీ మూర్ ప్రదర్శించిన పాత్రతో పొల్చాడు యాంకర్. ఈ సినిమాలో పాత్రధారి పూర్తిగా గుండుతో కనిపిస్తారు. జాడా పింకెట్ ఇప్పుడా సినిమా సీక్వెల్‌లో కనిపించనున్నారంటూ కామెడీ చేసే ప్రయత్నం చేశాడు. అయితే పింకెట్ ‘అలోపేసియా’ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారిలో జుట్టు ఊడిపోతుంటుంది. ఈ విషయాన్ని ఇటీవలే ఆమె చెప్పారు. అయితే అప్పటివరకూ స్మిత్ నవ్వుతూ కనిపించాడు. అలా ఒక్కసారిగా పైకి లేచి వేదికపైకి వెళ్లిన స్మిత్.. క్రిస్ చెంపపై చాచి కొట్టాడు. ఇదంతా చూస్తున్న ప్రేక్షకులకు ప్రాంక్..సరదా సన్నివేశం అనుకున్నారు. కానీ స్మిత్ మళ్లీ తన సీటులోకి వచ్చి కూర్చొని ‘నా భార్య పేరు ఎత్తే అర్హత కూడా నీకు లేదు… నీనోట ఆ పేరు రావొద్దు‘ అంటూ రెండు సార్లు బిగ్గరగా అరిచారు. దీంతో ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇదంతా సీరియస్ అని అప్పుడే అర్ధమైంది. స్మిత్ హెచ్చరికకు క్రిస్ ‘ఓకే’ అని సమాధానం ఇస్తూ.. ‘టెలివిజన్ చరిత్రలోనే ఇది ఓ గొప్ప రాత్రి’ అంటూ వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత కాసేపటికి ఆ సన్నివేశం చల్లారింది. తర్వాత యధావిధిగా వేడుక జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News