- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,259 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో కొత్తగా 35మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,20,855 కి చేరింది. తాజా కరోనా నుంచి 1,705 మంది కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య.. 4.24కోట్లకు చేరుకుంది. దేశవ్యాప్తంగా కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. దేశంలో ప్రస్తుతం 15,378 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 183కోట్లకు పైగా కరోనా డోసులను పంపిణీ చేసినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది.
India Reports 1259 New Corona Cases in 24 hrs
- Advertisement -