హైదరాబాద్: నగర ట్రాఫిక్ పోలీసులు కొత్త నిర్ణయం తీసుకున్నారు. రోడ్లపై వదిలివేసిన వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అలాంటి వాహనాలను మంగళవారం ట్రాఫిక్ క్రేన్ల ద్వారా స్వాధీనం చేసుకుంటున్నారు. సుమారు 15 రోజుల క్రితమే ఈ వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు నోటీసులు అతికించారు. అటువంటి వాహనాలను ఎక్కడికి తొలగించలేదు, మేము వాటిని సురక్షితంగా కస్టడీ కోసం మా యార్డ్‌లకు తరలించామని తెలిపారు. అప్పటికీ ఎవరూ వాటిని క్లెయిమ్ చేయకుంటే, హైదరాబాద్ సిటీ పోలీసు చట్టంలోని 39 బి కింద వేలం వేయబడతాయన్నారు. నగరంలో క్రేన్‌లు రాబోయే కొద్ది రోజుల పాటు ఈ డ్రైవ్‌ను కొనసాగిస్తాయని, రోడ్డుపై ఉన్న అలాంటి వాహనాలను వెంటనే తొలగించాలని కొరుతున్నట్టు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రోడ్లపై వదిలివెళ్లే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 15 రోజులపాటు కారును రోడ్డుపై వదిలి వెళ్లే తీవ్ర చర్యలు ఉంటాయన్నారు. వాహనాలను సీజ్ చేసి భారీ జరిమానా విధిస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.