Friday, November 22, 2024

బెంగళూరులో ఆటో నడుపుకుంటున్న రిటైర్డ్ ఇంగ్లీష్ లెక్చరర్!

- Advertisement -
- Advertisement -

english-speaking-auto-driver

బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరు నివాసి నికితా అయ్యర్ అనుకోకుండా చక్కని ఇంగ్లీషు మాట్లాడే ఓ ఆటో డ్రైవర్ ఆటో ఎక్కింది. అతడు చక్కని ఇంగ్లీషు మాట్లాడుతుండడంతో ప్రయాణిస్తున్నంత సేపు అతడితో మాటామంతీ కలిపింది. ఆయనతో కలిసి సంభాషించిన ఉదంతానంత ఆమె లింకెడిన్‌లో పోస్ట్ చేసింది. “నేను ఈ రోజు పనికి వెళుతున్నప్పుడు హైవే మధ్యలో ఓ ఉబెర్ ఆటో డ్రైవర్‌ను కలిశాను. ఆయన వయస్సులో చాలా పెద్ద వాడు. ఆయన నన్ను ఎక్కడి వెళ్లాలని అడిగాడు. కాస్త సందేహిస్తూనే ఆఫీసుకు వెళ్లాలని చెప్పాను. దానికాయన చక్కని ఇంగ్లీషులో జవాబిచ్చాడు. వచ్చి కూర్చొండి మేడం(ప్లీజ్ కమ్ ఇన్ మేడమ్), మీకు తోచింది ఇవ్వండి’ అని ఆయన చెప్పాడు.
‘మీరు ఇంత బాగా ఇంగ్లీషు మాట్లాడుతున్నారు…అదెలా’ అని నికితా అయ్యర్ అడిగినప్పుడు ఆయన తాను కర్నాటకలో పనిచేయడానికి ప్రయత్నించినప్పుడు ఉద్యోగం దొరక్కపోతే ముంబయి కాలేజ్‌లో దాదాపు 20 ఏళ్లు పనిచేశానని, 60ఏళ్లకు రిటైర్ అయి తిరిగా బెంగళూరు వచ్చేసి ఆటో నడుపుకుంటున్నానని తెలిపాడు. ప్రశ్నించగా ఆయన తన పేరు పట్టాభి రామన్ ఆయన తెలిపాడు.
“ అధ్యాపకులకు మంచి జీతం ఇచ్చేవారు కారు. ప్రైవేట్ సంస్థల్లో ఎక్కువలో ఎక్కువ రూ 10000 నుంచి 15000 మధ్య అందేది. నాకు పింఛను కూడా లేదు. నేను ఆటో నడపడం ద్వారా రోజుకు రూ. 700 నుంచి 1500 మధ్య సంపాదించుకుంటుంటాను. అది నాకు, నా గళ్ ఫ్రెండ్(భార్యను ఆయన అలా అన్నారు)కు సరిపోతుంది’ అని నవ్వుతూ చెప్పాడు. భార్యను మగాడి సేవకురాలిగా చూడడకూడదన్నది ఆయన ఉద్దేశ్యం. తన భార్య తనకన్నా ఏమీ తీసిపోదని, కొన్ని సందర్భాల్లో తనకన్నా తెలివిగా వ్యవహరిస్తుంటుందని ఆయన చెప్పుకొచ్చాడు. తన ఓ కుమారుడు  ఇంటి అద్దె కట్టే విషయంలో సాయపడుతుంటాడని చెప్పాడు. ‘మా పిల్లలు వారి జీవితాన్ని గడుపుతున్నారు. మేమేమి వారిపై ఆధారపడిలేము.  మేమంతా సంతోషంగానే ఉన్నాము’ అని చెప్పుకొచ్చాడు.

 

నాలుగు రోజుల క్రితం నికితా అయ్యర్ పెట్టిన ఈ పోస్ట్ కు 72వేల లైకులు వచ్చాయి. కాగా 2300 మంది షేర్ చేశారు. కామెంట్ సెక్షన్ లో ఒకరు దీనికి ‘ప్రేరణ ఇచ్చే కథనం’(ఇన్సిపిరేషనల్ స్టోరీ) అని రాశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News