- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 1 నుంచి ఆన్లైన్ లో సినిమా టిక్కెట్లు లభించనున్నాయి. టిక్కెట్ల అమ్మకాల కోసం ఎపి ప్రభుత్వం టెండర్లను పూర్తి చేసింది. ప్రైవేట్ సంస్థలకంటే తక్కువగా ప్రభుత్వమే నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. టెండర్లలో జస్ట్ టిక్కెట్ సంస్థ ఎల్-1 గా నిలిచినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని థియేటర్లు ఒకే సంస్థ ద్వారా టిక్కెట్ల అమ్మకాలు చేసేలా చర్యలు చేపట్టింది. ప్రేక్షకులపై ఆన్లైన్ చార్జీల భారం లేకుండా ప్రభుత్వమే నిర్వహణ చేయనుంది.
- Advertisement -