Friday, December 20, 2024

ట్విట్టర్లో సంఘీభావం తెలుపడం కాదు: ఎమ్మెల్సీ క‌విత

- Advertisement -
- Advertisement -

MLC Kavitha Counter to Rahul Gandhi Tweet

హైదరాబాద్: తెలంగాణ‌లో ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేసిన‌ ట్వీట్‌కు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత కౌంట‌ర్ ఇచ్చారు. రాజకీయ లబ్ది కోసం నామమాత్రంగా ట్విట్టర్లో సంఘీభావం తెలుపడం సరికాదన్నారు. ధాన్యం కొనుగోళ్ల‌కు సంబంధించి పంజాబ్‌, హ‌ర్యానా రాష్ట్రాల‌కు ఒక నీతి, ఇత‌ర రాష్ట్రాల‌కు మ‌రో నీతి ఉండ‌కూడ‌ద‌ని పేర్కొన్నారు. తెలంగాణ ఎంపిలు ప్రతిరోజు పార్లమెంట్ వెల్ లోకి వెళ్లి తమ తమ నిరసన తెలియజేస్తున్నారు.. మీకు నిజాయితీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా నిరసన తెలియజేయండని డిమాండ్ చేశారు. ఒక దేశం ఒకే సేక‌ర‌ణ విధానం కోసం డిమాండ్ చేయండన్నారు. రాహుల్ గాంధీ, మాణిక్యం ఠాగూర్ పై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. నేతల అహంకారమే కాంగ్రెస్ ను దిగజార్చుతోందన్నారు. కాంగ్రెస్ ఇప్పటికే లోక్ సభలో రెండంకెల సీట్లకు దిగజారిందని ఆమె ఎద్దేవా చేశారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజల కోసం పనిచేస్తానని కవిత స్పష్టం చేశారు. మీ నాయకుడు రాహుల్ గాంధీ వలే పారిపోలేదు.. ఓటమి భయంతో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయలేదని వెల్లడించారు. ‘ఒకేదేశం.. ఒకే ధాన్యం సేకరణ విధానం’పై రాహుల్ వైఖరేంటని ఆమె ప్రశ్నించారు. తెలంగాణలో కేంద్రం చివరిగింజ కొనేవరకు పోరాడుతామని కవిత పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News