Saturday, November 23, 2024

50 ఏళ్ల సరిహద్దు వివాదం చారిత్రక ఒప్పందంపై అస్సాం, మేఘాలయ  సంతకాలు

- Advertisement -
- Advertisement -

Assam CM Himanta Biswa Sarma and Meghalaya CM Conrad Sangma sign an agreement

న్యూఢిల్లీ:   రెండు ఈశాన్య రాష్ట్రాల మధ్య 50 ఏళ్లుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదానికి ముగింపు పలికేందుకు మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మరియు మేఘాలయ ముఖ్యమంత్రి  కాన్రాడ్ సంగ్మా ఒక ముఖ్యమైన చర్యలో సంతకం చేశారు. ‘ఈరోజు, అస్సాం, మేఘాలయ మధ్య 50 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సరిహద్దు వివాదం పరిష్కరించబడింది. వివాదం యొక్క 12 పాయింట్లలో 6 పరిష్కరించబడ్ఢాయి. మిగిలిన 6 పాయింట్లు వీలైనంత త్వరగా పరిష్కరించబడతాయి’ అని షా చెప్పినట్లు వార్తా సంస్థ ఎ ఎన్ఐ పేర్కొంది.

1972లో అస్సాం నుండి మేఘాలయను విభజించినప్పుడు దీర్ఘకాల భూవివాదం చెలరేగింది. కొత్త రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన ప్రాథమిక ఒప్పందంలో సరిహద్దుల విభజన యొక్క వివిధ రీడింగుల ఫలితంగా సరిహద్దు సమస్యలు వచ్చాయి.ఒప్పందంపై సంతకాలు చేయడానికి ముందు, ఇద్దరు ముఖ్యమంత్రులు  హోంవ్యవహారాల మంత్రితో  చివరి రౌండ్ చర్చలు జరిపినట్లు సమాచారం. హోం మంత్రిత్వ శాఖ  పరిశీలన  కోసం జనవరి 31న అస్సాం, మేఘాలయ సీఎంలు షాకు ముసాయిదా తీర్మానాన్ని సమర్పించారు. అస్సాం మరియు మేఘాలయ ప్రభుత్వాలు 884-కిమీ సరిహద్దులో ఉన్న 12 వ్యత్యాసాలలో ఆరింటిని పరిష్కరించడానికి ముసాయిదా తీర్మానాన్ని రూపొందించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News