Monday, December 23, 2024

ఢిల్లీలో సెంచరీ కొట్టిన పెట్రోల్

- Advertisement -
- Advertisement -

Petrol crosses Rs 100 in Delhi

పెట్రోల్ పై 80పై., డీజిల్‌పై 70 పై. పెంపు

న్యూఢిల్లీ: దేశంలో ఇంధన ధరల పెంపు నిర్నిరోధంగా మంగళవారం కూడా కొనసాగింది. గడచిన ఎనిమిది రోజుల్లో ఏడోసారి పెట్రోల్, డీజిల్‌పై భారం పడింది. లీటర్ పెట్రోల్‌పై 80 పైసలు, డీజిల్‌పై 70 పైసల చొప్పున ధరలు పెరిగాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో మొట్టమొదటిసారి లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు దాటేసింది. తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 100.21కి చేరుకోగా డీజిల్ ధర రూ. 91.47కి పెరిగింది. గడచిన ఎనిమిది రోజుల్లో డీజిల్, పెట్రోల్ ధర లీటరుకు రూ. 4.80 పెరిగింది. వివిధ రాష్ట్రాలలో స్థానిక పన్నుల మేరకు ఇంధన ధరలు వేర్వేరుగా ఉన్నాయి. ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల పుణ్యమాని నాలుగున్నర నెలలపాటు నిలకడగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మార్చి 22 నుంచి వరుసగా పెరుగుతూ పోతున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News