- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో మంగళవారం తాజాగా 1,259 కరోనా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా మరో 35 మంది మరణించగా 481 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,30,21,982కి చేరుకుంది. కాగా..యాక్టివ్ కేసుల సంఖ్య 15,358కి తగ్గింది. తాజా మరణాలతో కలిపి కరోనా కారణంగా ఇప్పటివరకు మొత్తం 5,21,070 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో మొత్తం 4,24,85,534 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. గడచిన 24 గంటల్లో 5,77,559 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వివరించింది. కాగా..దేశంలో ఇప్పటివరకు 183.53 కోట్ల మేరకు కొవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు కేంద్రం తెలిపింది.
- Advertisement -