Sunday, November 17, 2024

ఆరో ర్యాంక్‌కు మిథాలీ మహిళల వన్డే ర్యాంకింగ్స్

- Advertisement -
- Advertisement -

Mithali ranked sixth rank in Women ODI

 

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) మంగళవారం తాజాగా ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ తన ర్యాంక్‌ను మెరుగు పరుచుకుంది. వరల్డ్‌కప్‌లో నిలకడైన బ్యాటింగ్‌ను కనబరిచిన మిథాలీ ఆరో ర్యాంక్‌కు చేరుకుంది. వరుసగా రెండు మ్యాచుల్లో అర్ధ సెంచరీలతో అలరించిన మిథాలీ ఆరో స్థానానికి ఎగబాకింది. కిందటి సారి మిథాలీ తొమ్మిదో ర్యాంక్‌తో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. మరోవైపు భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన 669 పాయింట్లతో పదో ర్యాంక్‌ను కాపాడుకుంది. ఇక వరల్డ్‌కప్‌లో అద్భుతంగా రాణిస్తున్న సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ లౌరా వాల్వ్‌వర్డ్‌ట్ టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. లౌరా 740 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

ఇక ఆస్ట్రేలియా స్టార్ బేథ్ మేనీ రెండో ర్యాంక్‌కు పడిపోయింది. మూనీ 726 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో నిలిచింది. ఆస్ట్రేలియాకే చెందిన మెగ్ లానింగ్ మూడో ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. ఇంగ్లండ్ బ్యాటర్ నటాలి సివర్ నాలుగో, అలీసా హీలీ ఐదో ర్యాంక్‌ను కాపాడుకున్నారు. రాచెల్ హేన్స్ ఏడో ర్యాంక్‌లో నిలిచింది. టామీ బ్యూమౌంట్ (ఇంగ్లండ్), అమీ సాటర్‌వైట్ (న్యూజిలాండ్)లు కూడా టాప్10లో చోటు నిలబెట్టుకున్నారు. బౌలింగ్ విభాగంలో సోఫి ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్) 787 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది.

ఆస్ట్రేలియా స్టార్ జెస్ జోనెసన్ రెండో, షబ్నమ్ ఇస్మాయిల్ (సౌతాఫ్రికా) మూడో, మెగాన్ షుట్ (ఆస్ట్రేలియా) నాలుగో ర్యాంక్‌లో నిలిచారు. భారత వెటరన్ బౌలర్ జులన్ గోస్వామి 663 పాయింట్లతో ఐదో ర్యాంక్‌ను కాపాడుకుంది. మారిజానె కాప్ (సౌతాఫ్రికా), ఖాఖా (సౌతాఫ్రికా), క్రాస్ (ఇంగ్లండ్), ఎలిసె పేరి (ఆస్ట్రేలియా), మాథ్యూస్ (విండీస్)లు టాప్10 ర్యాంకింగ్స్‌లో స్థానాన్ని దక్కించుకున్నారు. ఆల్‌రౌండర్ విభాగంలో ఆస్ట్రేలియా స్టార్ ఎలిసె పేరి టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. నటాలి సివర్ రెండో, మారిజానె కాప్ మూడో, మాథ్యూస్ నాలుగో, అమెలియా కేర్ ఐదో ర్యాంక్‌లో నిలిచారు. భారత స్టార్‌లు దీప్తి శర్మ ఏడో, జులన్ గోస్వామి పదో ర్యాంక్‌ను దక్కించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News