Saturday, December 21, 2024

కాంట్రాక్టు సిబ్బంది క్రమబద్ధీకరణపై కసరత్తు

- Advertisement -
- Advertisement -

Finance Ministry exercise towards regularization of contract employees

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ దిశగా ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. 80 వేలకు పైగా కొత్త ఉద్యోగాల భర్తీతో పాటు 11వేలకు పైగా ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ మేరకు శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన చేసిన విషయం విధితమే. సిఎం నిర్ణయానికి అనుగుణంగా ఆర్థికశాఖ కార్యచరణ చేపట్టింది. అర్హులైన ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖలను కోరింది. 2016 ఫిబ్రవరి 26న ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. అదే రోజు అందుకు సంబంధించిన మెమో కూడా ఇచ్చింది. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కొందరు కోర్టుకు వెళ్లడంతో 2017లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో క్రమబద్ధీకరణ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ పిటిషన్‌ను 2021 డిసెంబర్ 7న ఉన్నత న్యాయస్థానం. కొట్టివేసింది. దీంతో ఉద్యోగుల క్రమబద్ధీకరణకు మార్గం సుగమమైంది.కేటాయింపు అయిన పోస్టుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్‌కు అనుగుణంగా విధుల్లో ఉన్న ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేపట్టేందుకు ఆర్థికశాఖ పరిశీలన, ఆమోదం కోసం వీలైనంత త్వరగా అన్ని శాఖలు ప్రతిపాదనలు పంపాలని ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News