- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి కూలీరేట్లను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేశంలోనే అత్యధికంగా హర్యాణ రాష్ట్రంలో రూ.331 కూలీని ప్రకటించింది.పంజాబ్ రాష్ట్రానికి కూడా రూ.282 ప్రకటించింది. దేశంలోనే అతితక్కువ కూలీరేట్ల ప్రకటించిన రాష్ట్రాల్లో బీహార్ , జార్ఖండ్ రాష్ట్రాలకు రూ.210, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాలకు రూ.212 ప్రకటించింది.తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి మాత్రం రూ.257 ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇదే రేటును ప్రకటించింది. పెంచిన ఉపాధిహామీ పథకం కూలీరేట్లు ఏప్రిల్ ఒకటినుంచే అమల్లోకి వస్తాయని కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి రోహిత్ కుమార్ వెల్లడించారు.
- Advertisement -