- Advertisement -
హైదరాబాద్: ఉప్పల్ నుంచి యాదాద్రికి బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఉప్పల్ నుంచి మినీ బస్సులను ఆర్టీసీ ఛైర్మన్, ఎండి బుధవారం ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం ఉప్పల్ బస్టాండ్ నుంచి యాదాద్రికి బస్సులు సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చామని వారు తెలిపారు. యాదగిరిగుట్టకు 100 మినీ బస్సులు అందుబాటులో ఉన్నాయని సజ్జనార్ పేర్కొన్నారు. ప్రతి జిల్లా కేంద్రం నుంచి ఉప్పల్ సర్కిల్ కు బస్సులు ఉన్నాయని ఆర్టీసీ ఎండి తెలిపారు. గుట్టకు జేబిఎస్ నుంచి రూ.100, ఉప్పల్ నుంచి రూ.75 చార్జీ ఉంటుందన్నారు. ఇతర జిల్లాల నుంచి ప్రత్యేక యాదాద్రి బస్సులు ఏర్పాటు చేస్తామని సజ్జనార్ వెల్లడించారు.
- Advertisement -