- Advertisement -
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై బిజెపి కార్యకర్తలు బుధవారం దాడి చేశారు. కేజ్రీవాల్ ఇంట్లోకి దూసుకెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. అంతేకాకుండా ఇంటి ముందున్న బారికేడ్లు ధ్వంసం చేశారు. దీంతో భద్రతా సిబ్బంది కార్యకర్తలను అడ్డుకుంది. దీంతో బిజెపి కార్యకర్తలు కేజ్రీవాల్ ఇంటిముందు బైఠాయించి నిరసన తెలిపారు. కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై కేజ్రీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని బిజెపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement -