Friday, December 20, 2024

లఖింపూర్ ఖేర్ కేసు : కేంద్ర మంత్రికి షాక్

- Advertisement -
- Advertisement -

SC pulls up UP govt for not cancelling Ashish Misra bail

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేర్‌లో జరిగిన హింసాకాండ కేసుపై దర్యాప్తును పర్యవేక్షిస్తున్న సుప్రీం కోర్టు నియమిత కమిటీ సిఫారసు కేంద్ర మంత్రి అజయ్‌మిశ్రాకు గట్టి షాక్ ఇచ్చింది. ఆయన కుమారుడు, ఈ కేసులో నిందితుడైన ఆశిష్ మిశ్రాకు మంజూరైన బెయిలును రద్దు చేయాలని ఈ కమిటీ సిఫారసు చేసినట్టు సుప్రీం కోర్టు బుధవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఆశిష్ మిశ్రాకు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు బుధవారం విచారణ జరిపింది. ఆశిష్ బెయిల్‌ను రద్దు చేయాలని తాను నియమించిన కమిటీ సిఫారసు చేసిందని , దీనిపై వైఖరిని సోమవారం నాటికి తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ బెయిలును రద్దు చేయాలని కోరుతూఏ సుప్రీం కోర్టులో అపీలు చేయాలని పర్యవేక్షక న్యాయమూర్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారని , రాష్ట్ర హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ ) రెండు లేఖలు రాసిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ చెప్పారు. లఖింపూర్ ఖేర్‌లో 2021 అక్టోబరులో జరిగిన హింసాకాండలో ఎనిమిది మంది మరణించారు. వీరిలో నలుగురు రైతులు ఉన్నారు. బాధితుల కుటుంబ సభ్యులు ఆశిష్‌కు బెయిలు ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. దీంతో సుప్రీం కోర్టు స్పందిస్తూ సిట్ నివేదికలను పరిశీలించాలని, ఏప్రిల్ 4 నాటికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని సూచించారు. ఇదిలా ఉండగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం స్పందిస్తూ బెయిలు ను సమర్ధవంతంగా వ్యతిరేకించ లేదనే ఆరోపణలను తోసి పుచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News