Thursday, December 19, 2024

ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్.. పదో స్థానంలో కోహ్లి

- Advertisement -
- Advertisement -

Rohit and Kohli slip in ICC Test Rankings 

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన ఐసిసి టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా ఏడో ర్యాంక్‌కు దూసుకెళ్లాడు. ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో ఖ్వాజా అద్భుత ఆటను కనబరిచిన విషయం తెలిసిందే. దీంతో అతని ర్యాంక్ గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో ఖ్వాజా ఏకంగా ఆరు ర్యాంక్‌లను మెరుగు పరుచుకొని ఏడో స్థానానికి చేరుకున్నాడు. ఇక ఆస్ట్రేలియాకే చెందిన మార్నస్ లబూషేన్ 892 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. మరో స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఒక ర్యాంక్‌ను మెరుగు పరుచుకుని రెండో స్థానంలో నిలిచాడు. కేన్ విలియమ్సన్ కూడా ఒక ర్యాంక్ పెరిగి మూడో ర్యాంక్‌కు దూసుకెళ్లాడు. కాగా ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ నాలుగో ర్యాంక్‌కు పడిపోయాడు. బాబర్ ఆజమ్ (పాకిస్థాన్) ఐదో, కరుణరత్నె (శ్రీలంక) ఆరో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నారు. భారత స్టార్‌లు రోహిత్ శర్మ 8వ ర్యాంక్‌లో నిలువగా, విరాట్ కోహ్లి పదో ర్యాంక్‌తో సరిపెట్టుకున్నాడు. బౌలింగ్ విభాగంలో పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. అశ్విన్(భారత్) రెండో, రబడా(సౌతాఫ్రికా) మూడో, బుమ్రా(భారత్) నాలుగో ర్యాంక్‌లో నిలిచారు.

Rohit and Kohli slip in ICC Test Rankings 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News