హైదరాబాద్: తెలంగాణలోని ఇరవై జిల్లాల్లో జీరో కోవిడ్-19 కేసులున్నాయని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాస్ రావు గురువారం వెల్లడించారు. కేవలం జిహెచ్ఎంసి ప్రాంతంలోనే ఒక్క 20 కేసులు నమోదు అవుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్క మాస్క్ తప్ప అన్ని నిబంధనలను ఎత్తివేసిందన్నారు. కరోనా పూర్తిగా తొలిగిపోలేదన్న ఆయన కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. మనం ఎండ్ మిక్ స్టేజికి చేరుకున్నామని తెలిపారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలన్నారు. జన సాంద్రత ఉన్న ప్రాంతంలోకి వెళ్లే వారు ఖచ్చితంగా మాస్కు ధరించాలని వెల్లడించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకంలో మనం 3వ కోవిడ్ వేవ్ ని సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని స్పష్టం చేశారు. 100 శాతం మొదటి,రెండవ డోస్ చేసుకున్నామని తెలిపారు. 12 నుంచి 14 సంవత్సరాలు వయ్యస్సు వారికి 54 శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయిందన్నారు. 15 నుంచి 17 సంవత్సరాలు వయసు వారికి దాదాపు 100 శాతం పూర్తి కావచ్చిందన్నారు. బ్రెయిన్ ట్యూమర్ తోనే బాలుడు చనిపోయాడు వాక్సిన్ తో కాదన్నారు. ఎక్కడ వాక్సిన్ రియాక్షన్స్ లేవుని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో కోవిడ్ పూర్తిగా అదుపులో ఉంది: ఆరోగ్య శాఖ
- Advertisement -
- Advertisement -
- Advertisement -