- Advertisement -
సభ్యుల వీడ్కోలు సభలో ఉప రాష్ట్రపతి
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా చట్టసభల సభ్యులు తమ బాధ్యతల నిర్వహణలో చిత్తశుద్ధిని ప్రదర్శించాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. 72 మంది రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు చెపుతూ గురువారం ఆయన సభలో మాట్లాడారు. పట్టుదల, పనితీరు, సభాకార్యక్రమాలపై సమగ్రత అత్యవసరం అని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. సభా కార్యకలాపాల విచ్ఛిత్తికి పాల్పడే తత్వం మంచిది కాదని హితవు పలికారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సభ్యులు వ్యవహరించాల్సి ఉంటుంది. తమ ముందుకు వచ్చిన చట్టాలు, పాలసీలలో ప్రజల సంక్షేమం మిళితం అయ్యేలా చూడాల్సి ఉందని రాజ్యసభ అద్యక్షులు అయిన వెంకయ్యనాయుడు కోరారు.
- Advertisement -