Friday, December 20, 2024

ఈశాన్య రాష్ట్రాల్లోని 36 జిల్లాలో ’అఫ్స్పా‘ నుంచి మినహాయింపు

- Advertisement -
- Advertisement -

AFSPA
న్యూఢిల్లీ: సాయుధ దళాల ప్రత్యేక అధికార చట్టం(అఫ్స్పా) పరిధి నుంచి ఈశాన్య రాష్ట్రాల్లోని 36 జిల్లాలను మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. అస్సాంలో 23, మణిపూర్‌లో 6, నాగాలాండ్‌లో 7 జిల్లాలకు ఈ మినహాయింపు లభించింది. అఫ్స్పా 1958 సెప్టెంబర్ 11 నుంచి అమల్లోకి వచ్చింది. ఘర్షణలు జరిగే ప్రాంతాల్లో శాంతిభద్రతలను కాపాడటం కోసం ఈ చట్టాన్ని తెచ్చారు. ఈ చట్టం ప్రకారం అవసరమనుకుంటే చర్యలను చేపట్టేందుకు సాయుధ దళాలు అమలు చేయడానికి ఈ చట్టం అనుమతి ఇస్తుంది. తీవ్రవాదుల శిక్షణ స్థావరాలను ధ్వంసం చేయడం, వారెంట్ లేకుండా వ్యక్తులను అరెస్టు చేయడం వంటి వాటికి ఇది అవకాశం కల్పిస్తుంది. ఈ చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది.
నాగాలాండ్‌లో ఈ చట్టాన్ని ఉపసంహరించే అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని గత ఏడాది ఏర్పాటు చేసింది. గత ఏడాది డిసెంబరు 23న కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో ఓ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయిఫియు రియో, ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వై పట్టోన్, ఎన్‌పిఎఫ్‌ఎల్‌పి నేత టిఆర్ జెలియాంగ్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం ఇచ్చిన ట్వీట్‌లో, మంచి నిర్ణయాలు తీసుకునే సత్తాగల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం అత్యంత ముఖ్యమైన చర్యను చేపట్టిందని తెలిపారు. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ప్రకారం నాగాలాండ్, అస్సాం, మణిపూర్ రాష్ట్రాల్లోని కల్లోలిత ప్రాంతాలను తగ్గించాలని నిర్ణయించిందన్నారు. అనేక దశాబ్దాల అనంతరం ఈ చర్యను తీసుకున్నట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News