Saturday, September 21, 2024

‘మిషన్ ఇంపాజిబుల్’కు ‘చంటబ్బాయ్’ స్ఫూర్తి అన్నారు: చిరంజీవి

- Advertisement -
- Advertisement -


తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ స్వరూప్ ఆర్.ఎస్.జె. దర్శకత్వం వహించారు. ఈ చిత్రం శుక్రవారం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ “ఈ సినిమాకు నేను చేసిన ‘చంటబ్బాయ్’ స్ఫూర్తి అని దర్శకుడు అన్నాడు. ఈ చిత్రానికి మంచి కాంబినేషన్ కుదిరింది.

ఈ సినిమా చూశాను. ఇందులో తాప్సీ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ సినిమాలోని ముగ్గురు పిల్లలు బాగా ఎంటర్‌టైన్ చేస్తారు. వీరిని చూస్తుంటే నేను నటుడి అవ్వాలనుకునే బీజం ఏర్పడిన రోజు గుర్తుకు వస్తుంది. నేను 8వ తరగతి చదవుతుండగా ‘బాలరాజు కథలో’ని ‘మహాబలిపురం…’ అనే పాట పాడిన ప్రభాకర్ ప్రభావం నాపై ఉంది. అలా పడిన బీజం నన్ను నటుడిలా మారేలా చేసింది. ఈ సినిమాను దర్శకుడు స్వరూప్ ఆర్.ఎస్.జె అద్భుతంగా తెరకెక్కించాడు”అని అన్నారు. తాప్సీ మాట్లాడుతూ “నాకు స్పెషల్ మూవీ ఇది.

ఈ సినిమాకు ముగ్గురు పిల్లలే హీరోలు. హిందీలో ఎంత బిజీగా ఉన్నా కూడా నేను తెలుగులో సినిమాలు చేస్తూనే ఉంటాను”అని తెలిపారు. చిత్ర దర్శకుడు స్వరూప ఆర్.ఎస్.జె. మాట్లాడుతూ “తాప్సీ కథ వినగానే వెంటనే ఈ సినిమా చేస్తానన్నారు. ఆమె ఈ కథలో 45 నిముషాలు మాత్రమే ఉంటుంది. పాత్ర నిడివి కాదు… కథ నచ్చి తాప్సీ ఈ సినిమా చేశారు”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాత నిరంజన్ రెడ్డి, సంగీత దర్శకుడు మార్క్ రాబిన్, వినోద్, మహ, రవీందర్ విజయ్, హర్షవర్ధన్, సుహాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News