Monday, December 23, 2024

‘టైగర్ నాగేశ్వర రావు’కు జోడీగా…

- Advertisement -
- Advertisement -

Tiger Nageswara rao movie

మాస్ మహారాజా రవితేజ మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’ టైటిల్ పోస్టర్‌తో ఆసక్తిని కలిగించింది. విమర్శకుల ప్రశంసలు పొందిన కమర్షియల్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్’ను రూపొందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్రం రవితేజ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మించబడుతోంది. ఈ సినిమాలో రవితేజ సరసన నటించే హీరోయిన్‌ను మేకర్స్ ఖరారు చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ తార నూపూర్ సనన్‌ను ఎంపిక చేశారు.

ఆమె ఇప్పుడు తెలుగులో ‘టైగర్ నాగేశ్వరరావు’తో అరంగేట్రం చేస్తోంది. గతంలో అక్షయ్ కుమార్‌తో కలిసి మ్యూజిక్ వీడియోలో కనిపించిన నూపూర్‌కి రవితేజతో చేస్తున్న ఈ సినిమా మొదటి చిత్రం కావడం విశేషం. ఇక హైదరాబాద్‌లో ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాన్ని ఉగాది రోజున ప్రారంభించనున్నారు. అదే రోజు సినిమా ప్రీ లుక్‌ని కూడా విడుదల చేయనున్నారు. పవర్ ఫుల్ స్క్రిప్ట్ అందించిన వంశీ ఈ సినిమాలో రవితేజను పూర్తిగా మాస్ లుక్‌లో చూపించబోతున్నాడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News