Monday, December 23, 2024

మద్రాసు జడ్జిగా శ్రీశ్రీ కూతురు..

- Advertisement -
- Advertisement -

చెన్నై: ప్రముఖ విప్లవ కవి శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) కూతురు నిడుమోలు మాలా గురువారం మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆమెతో పాటు న్యాయమూర్తిగా మయిలదుతురై సౌంతర్ కూడా బాధ్యతలు తీసుకున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం ఆదేశాల మేరకు వీరిరువురికి న్యాయమూర్తులుగా నియామకాలు జరిగాయి. కవి శ్రీశ్రీ సరోజిని దంపతుల నలుగురు పిల్లల్లో మాలా చిన్నవారు. శ్రీశ్రీ కుమార్తె మాలా 1989లో లాయర్‌గా ప్రాక్టిస్ ప్రారంభించారు. మద్రాసు హైకోర్టు, సుప్రీంకోర్టులలో పలు కేసులలో వాదించిన ఘనత దక్కించుకున్నారు. రెండేళ్ల క్రితం పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం ప్రభుత్వ ప్లీడర్‌గా నియమితులు అయ్యి ఇప్పుడు పదోన్నతి పొందారు.

Sri Sri Daughter Mala Appointed as Judge of Madras HC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News