Monday, December 23, 2024

ఎపిలో 8మంది ఐఎఎస్‌లకు జైలుశిక్ష..

- Advertisement -
- Advertisement -

ఎపిలో 8మంది ఐఎఎస్‌లకు జైలు జరిమానా
కోర్టును క్షమాపణలు కోరిన ఐఎఎస్‌లు
ఏడాది పాటు ‘సేవా’ చేయాలంటూ ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఎఎస్‌లకు హైకోర్టు జైలుశిక్ష విధించింది. విజయ్ కుమార్, శ్యామల రావు, గోపాల కృష్ణ ద్వివేది, బుడితి రాజశేఖర్, శ్రీలక్ష్మీ, గిరిజా శంకర్, వాడ్రేవు చిన వీరభద్రుడు, ఎం.ఎం. నాయక్‌కు రెండు వారాలు జైలుశిక్షతో పాటుగా జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. వెంటనే ఐఎఎస్‌లు క్షమాపణ కోరడంతో సామాజిక సేవకు అంగీకరిస్తే క్షమాపణలను అంగీకరిస్తామని పేర్కొంది. దీంతో వారు సుముఖత వ్యక్తం చేయడంతో జైలుశిక్ష తప్పించి ఏడాది పాటు హాస్టళ్లలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొంది. సంక్షేమ హాస్టళ్లలో నెలలో ఒకరోజు వెళ్లి సేవ చేయాలని ఐఎఎస్‌లను ఆదేశించింది. విద్యార్థుల మధాహ్నం, రాత్రి భోజన ఖర్చులు భరించాలని తీర్పు వెల్లడించింది. సామాజిక సేవ చేసేందుకు 8మంది ఐఏఎస్‌లు సిద్ధపడటంతో జైలుశిక్ష విధింపు తీర్పును సవరించినట్లు హైకోర్టు పేర్కొంది.ఈక్రమంలో కృష్ణా జిల్లా గోపాలకృష్ణ ద్వివేది, ప్రకాశం జిల్లా గిరిజా శంకర్, శ్రీకాకుళం జిల్లా బుడితి రాజశేఖర్, విజయనగరం జిల్లా చినవీరభద్రుడు, అనంతపురం జిల్లా జె.శ్యామలరావు, ప.గో. జిల్లా శ్రీలక్ష్మి, కర్నూలు జిల్లా విజయ్ కుమార్, నెల్లూరు జిల్లా ఎం.ఎం.నాయక్‌లు సేవా కార్యక్రమాలు చేపట్టాలని తెలిపింది.
ఇది జరిగింది: ఎపిలోని ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ, వార్డు సచివాలయాలను తొలగించాలని 2020లో ఇచ్చిన ఉత్తర్వులను ఏడాదిపాటు అధికారులు పట్టించుకోకపోవడంతో సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. ఉద్దేశపూర్వకంగా అధికారులు కోర్టు ఉత్తర్వుల అమలును నిర్లక్ష్యం చేశారన్న కారణంతో 8 మంది ఐఏఎస్‌లకు రెండు వారాలు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఐఎస్‌లు క్షమాపణలు కోరటంతో హైకోర్టు ధర్మాసనం తన తీర్పును సవరిస్తూ సామాజిక సేవ చేయాలని ఆదేశించింది.

AP High Court Sentences 8 IAS Officers to Jail

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News