Saturday, November 23, 2024

అవరోధాల్లోనూ ముందుకు..

- Advertisement -
- Advertisement -

2021-22లో ఇన్వెస్టర్ల సంపద రూ.59 లక్షల కోట్లు పెరిగింది
గత ఆర్థిక సంవత్సరంలో సెన్సెక్స్ 18 శాతం జంప్

BSE
న్యూఢిల్లీ : నేటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం (2022-23)లో అడుగుపెడుతున్నాం. అయితే గత ఆర్థిక సంవత్సరం(2021-22)లో స్టాక్‌మార్కెట్ ఎలా ఉందంటే, ఇన్వెస్టర్లు భారీగా లాభాలను ఆర్జించారు. 2021-22లో ఇన్వెస్టర్ల సంపద రూ.59.75 లక్షల కోట్లు పెరిగింది. సెన్సెక్స్ 18 శాతం పెరిగింది. ఎన్నో అడ్డంకులు, ఎదురుగాలు వీచినప్పటికీ గత ఆర్థిక సంవత్సరం తట్టుకుని నిలబడింది. సెన్సెక్స్ 9,059.36 పాయింట్లు (18.29 శాతం) లాభపడింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం ఆందోళనలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ మార్కెట్ ఆశావాహ దృక్పథంతో రాణించింది. మార్చి 31 నాటికి బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.59.75 లక్షల కోట్లు పెరిగి రూ.264 లక్షల కోట్లకు చేరింది. కరోనా ఆంక్షలను ఎత్తివేయడంతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడం, త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉండడంతో సానుకూల సెంటిమెంట్ కొనసాగింది.

రెలిగేర్ బ్రోకింగ్ విపి రీసెర్చ్ అజిత్ మిశ్రా మాట్లాడుతూ, ఈక్విటీ మార్కెట్లు అన్ని ప్రతికూలతలను తట్టుకుని పటిష్ఠంగా ముందుకు సాగాయని, మొత్తానికి 202122 ఆర్థిక సంవత్సరం ఆరోగ్యకరమైన లాభాలతో ముగిసిందని అన్నారు. 2022 జనవరి 17న బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.280 లక్షల కోట్లతో ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరింది. ఆ తర్వాత ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. గురువారం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 115 పాయింట్ల నష్టంతో 58,568 పాయింట్ల వద్ద ముగిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News