- Advertisement -
హైదరాబాద్: నగరంలో మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టైంది. పంజాబ్ నుంచి డ్రగ్స్ ను హైదరాబాద్ తరలిస్తున్న ఇద్దరిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్దనుంచి 900 గ్రాముల మత్తుపదార్థాలు, రూ. లక్షా నబభై వేల నగదు, ఒక కారు, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు నిందితులను కమిషనర్ మహేష్ భగవత్ మీడియా సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఇప్పటికే భాగ్యనగరంలో డ్రగ్స్ కలకలం రేగుతున్న సంగతి తెలిసిందే.
- Advertisement -