Monday, December 23, 2024

మట్టి కుండ.. పోషకాలకు అండ

- Advertisement -
- Advertisement -

Growing preference for pottery in summer

వేసవిలో మట్టికుండలకు పెరుగుతున్న ప్రాధాన్యత
ఫ్రిజ్ నీటికంటే కుండ నీరే ఆరోగ్యానికి
మంచిదంటున్న వైద్య నిపుణులు

హైదరాబాద్: టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా సాంప్రదాయ పద్ధతులమీద నగర ప్రజలు ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తున్నారు. త్రాగే ఆహరం మొదలు ఆహరం కోసం వినియోగించే సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయల వరకు సాంప్రదాయ పద్దతులనే అధికంగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా వేసవిలో తాగేందుకు ఇళ్ళలో వేల ఖరీదు చేసే రీఫ్రిజిరేటర్లు ఉన్నా అనేక మంది మట్టికుండల్లోనే మంచినీరు త్రాగేందుకు అధిక ప్రాధాన్యాత ఇస్తున్నారు.దానికి ప్రధాన కారణంగా వేలు, లక్షలు ఖరీదు చేసే ఫ్రిజ్‌లు (రిఫ్రిజిరేటర్లు) కలిగించన అనేక ప్రయోజనాలు మట్టికుండలు కల్పించడమే దానికి ప్రధాన కారణం. దాంతో వాటి ప్రాధాన్యత పెరుగుతుందే కాని ఏమాత్రం తగ్గడం లేదు.అంతే కాదు ఫ్రిజ్‌లో నీళ్ళకంటే మట్టికుండలోని నీళ్ళు త్రాగడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగతుందని వైద్యనిపుణులు కూడా చెబుతున్నారు. అయితే కాలక్రమేణ మట్టికుండలు కనుమరుగైనా అందులోని నీటికి మాత్రం ఆదరణ తగ్గలేదు.

మట్టికుండల్లోని నీటిని తాగడం ద్వారా వాటిలో ఉండే పోషక విలువలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్యనిపుణులతో పాటు పర్యావరణ శాస్త్రవేత్తలు సైతం చెబుతున్నారు.మట్టికుండలోని నీరు త్రాగడం ద్వారాజీర్ణక్రియ పెరుగుతుంది. ప్లాస్టిక్ బాటిళ్ళు, క్యాన్లలో నిల్వ ఉంచిన నీ ళ్ళలో డిస్పినాల్ వంటి హనికర రసాయనాలు ఉం టాయి. ఇటువంటి నీటిత్రాగడం ద్వారా ఆరోగ్యానికి హనికలుగుతుంది. ప్లాస్టిక్ బాటిల్లో ఉంచి నీరు త్రాగడం మట్టికుండలో నీరు త్రాగడం ఎంతో మే లు. దీనిద్వారా మనశరీరంలో టెస్టోసిరాన్ హర్మోన్ పెరిగే అవకాశం ఉంటుంది. ఆల్‌లైన్ మట్టి పిహెచ్ సమతుల్యతను అందిస్తుంది. ఈ నీటి త్రాగడంతో నీటిలోని ఆమ్లతత్వం సాయంతో క్రమంగా గ్యాస్ట్రోనోమిక్ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆరోగ్యనిపుణులు పేర్కొంటున్నారు.హైదరాబా ద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కూడా మట్టికుండలకు వేసవిలో ఆదరణ పెరుగుతోంది.

మట్టి కుండల్లో నీరు మరీ చల్లగా ఉండకుండా మధ్యస్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఈ నీటని తాగేటప్పుడు గొంతు సమస్యలు ఉత్పన్నం కావు, అదే ఫ్రిజ్‌లలో ఉన్న నీరు త్రాగడం ద్వారా గొం తులో ఇన్‌ఫెక్షన్స్ వచ్చి గొంతుననొప్పి, జలుబు చేయడం వంటి సమస్యలు వస్తాయి. ఆరోగ్యనిపుణులు సైతం మట్టికుండల్లోనే నీరే మంచిదని నొక్కవక్కాణించి చెబుతున్నారు. బంకమట్టితో తయారు చేసిన కుండనులనునీడలో ఆరనిచ్చి తర్వాత ఎం డలో పెట్టి ప్రత్యేక బట్టిల్లో వాటిని కాల్చి అనంతర ం విక్రయిస్తారు.కుండలు, బిందెలు, కూజలు,జ మాల్ తదితరవాటిని మార్కెట్లో వ్యాపారులు విక్రయిస్తున్నారు. ఒకొక్క కుండ నీటి నిల్వసామర్థం 10 నుంచి 25 లీటర్లు వరకు ఉంటుంది. వీటి సా మాన్యునికి సైతం అందుబాటులో ఉండే విధంగా రూ.125 నుంచి 300 వరకు వాటి సైజులనుబట్టి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News