మన తెలంగాణ,సిటీబ్యూరో: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని రూపొందించిన సరికొత్త ఇన్మరేష్మన్ మేనేజ్మెంట్ సాప్ట్‌వేర్‌ను బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించింది. శనివారం ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ, భరత్ ట్రస్టు సభ్యులు, గీతం డీమ్డ్ యూనివర్శిటీ వారి సమక్షంలో ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు అందుబాటైన ధరలలో, ప్రపంచస్దాయి నాణ్యమైన సేవలు అందించడంలో సంస్ద ముందంజలో ఉంటోందన్నారు. ఇతర ఆసుపత్రులతో పోల్చిస్తే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకుని రావడంలో ఎప్పుడు ముందు వరసలో ఉంటామని, ఈసాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పడు బీమ్ అని నామకరణం చేయబడిన ఈ అత్యాధునిక సాప్ట్‌వేర్ వ్యవస్దను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. అనంతరం భరత్ ట్రస్టు బోర్డు సభ్యులు వివరిస్తూ నేడు ప్రవేశపెట్టిన ఈఅత్యాధునిక సాప్ట్‌వేర్‌కు బీమ్ అన్న పేరు సరిగ్గా సరిపోతుందన్నారు. రెండు దశాబ్దాలకు పైగా క్యాన్సర్‌కు సంబంధించిన చికిత్స అందిస్తున్న బసవతారకం ఆసుపత్రిలో మరిన్ని నాణ్యమైన, పారదర్శకతతో కూడిన సేవలను అన్ని వర్గాలకు సమాన స్దాయిలో అందేలా చూడటంలో సాప్ట్‌వేర్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈకార్యక్రమంలో గీతం యూనివర్శిటీ డా. ఆర్.వి.ప్రభాకర్‌రావు, టియస్‌రావు, కె.ఫణికోటేశ్వరరావు, కల్పనా రఘనాథ్, గోపాలకృష్ణ, ఐ.సురేష్‌కుమార్, రజిత తదితరులు పాల్గొన్నారు.
క్యాన్సర్ రోగుల కోసం అత్యాధునిక సాంకేతికత తీసుకొచ్చిన బసవతారకం ఆసుపత్రి
- Advertisement -
- Advertisement -
- Advertisement -