Friday, May 16, 2025

ఇటిక్యాల యువతికి కరాటేలో బంగారు పతకం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/రాయికల్‌: జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన అంతడుపుల రమ(21) అనే యువతికి కరాటేలో బంగారం పతకం లభించింది. ఇటీవల గోవాలో జరిగిన ఆసియా ఇంటర్నేషనల్ కరాటే చాంఫియన్‌షిప్ పోటీల్లో పాల్గొన్న రమ తమ ప్రతిభతో బంగారు పతకం సాధించింది. రమ హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిజి చదువుతున్న ఆమె చిన్నప్పటి నుండే కరాటేలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తు ఉండేదని గ్రామస్థులు చెప్పారు. బంగారు పతకం సాధించిన రమను గ్రామసర్పంచ్ సామల్ల లావణ్య వేణు శాలువతో శనివారం సన్మానించారు. గ్రామస్తులు, అంబేడ్కర్ యూత్ సభ్యులు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News