- Advertisement -
ఐజ్వాల్: కొత్త ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసుల నేపథ్యంలో మిజోరాం ప్రభుత్వం పందులు, పంది ఉత్పత్తుల దిగుమతిని నిషేధించింది. బతికున్న పందులు, మాంసంను ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి దిగుమతి చేసుకోవడంపై పూర్తి నిషేధం ఉంటుందని నోటిఫికేషన్ జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇది అమల్లో ఉంటుందని పేర్కొంది. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంచేసింది. పందులను పెంచేచోట తగు జాగ్రత్తలు పాటించాలని పశుసంవర్ధక శాఖ సూచించింది. పందుల మరణాల గురించి తక్షణమే తెలియజేయడానికి ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్‌లను కూడా జారీ చేసింది.0389-2336441, 9436142908, 9436151203, 8794206212. మిజోరం ఫిబ్రవరి 1న పందులు, పంది మాంస ఉత్పత్తుల దిగుమతిపై నిషేధాన్ని ఎత్తివేసింది.
- Advertisement -