న్యూఢిల్లీ: భారత నూతన ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే స్థానంలో ఆయన ఈ నెలాఖరున పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ మధ్య కాలంలో ఓ విమాన ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మరణించిన విషయం తెలిసిందే. ఆయన స్థానాన్ని నరవణే భర్తీ చేయనున్నారని సమాచారం. గత మూడు నెలల్లో పదవీ విరమణ చేసిన కొంతమంది ఉన్నతాధికారుల తర్వాత సీనియర్‌గా లెఫ్టినెంట్ జనరల్ పాండే ఉన్నారు. ప్రస్తుత లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా ఈ నెల 31న రిటైర్ అవుతున్నారు. జనరల్ రాజ్ శుక్లా స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ ఎస్‌ఎస్ మహల్ సిమ్లాలో బాధ్యతలు చేపట్టనున్నారు. ఆర్మీ అడ్జుటంట్ జనరల్‌గా లెఫ్టినెంట్ జనరల్ సి. బన్సీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉత్తర భారత్ ప్రాంతానికి జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌గా లెఫ్టినెంట్ జనరల్ జెపి మాథ్యూస్ బాధ్యతలు చేపట్టనున్నారు.