Saturday, November 23, 2024

గుట్టంతా భక్తజనం

- Advertisement -
- Advertisement -

Task Force Police Raid at Radisson Blu Hotel

మన తెలంగాణ/యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహుని సన్నిధికి వచ్చే విఐపిలకు శని, ఆదివారం, ప్రభుత్వ సెలవు దినాల్లో బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. ఈ మేరకు ఇఒ గీత ఆదేశాలు జారీ చేశారు. స్వామిని దర్శించుకునేందుకు వచ్చే విఐపిల కోసం ఉదయం, సాయంత్రం బ్రేక్ దర్శనాలు ఏర్పాటు చేశారు. అయితే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అయా రోజుల్లో బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, నరసింహస్వామిని రాష్ట్ర మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రులకు దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. మొదట ధ్వజస్తంభం పూజలు చేశారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత అర్చకులు ఆశీర్వచనం చేయగా,ఈవో గీత తీర్థ ప్రసాదాలను అందజేశారు.

పోటెత్తిన భక్తజనం
యాదాద్రి నూతన ఆలయ దర్శనాల ప్రారంభం, వరస సెలవులు రావడంతో లక్ష్మీనరసింహుని దర్శనార్ధం తరలి వచ్చిన భక్తజనంతో యాదాద్రి కొండ పోటెత్తింది. మూడు రోజులుగా యాదాద్రి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది. తెల్లవారుజామున సుప్రభాతసేవ, అర్చన అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో స్వామి దర్శనానికి సుమారు 3 నుంచి 4గంటల సమయం పట్టింది. నూతన యాదాద్రి ఆలయంలో స్వామిని దర్శించుకున్న భక్తులు ఆలయ నిర్మాణాలను చూసి స్వామి నామ స్మరణతో పులకించారు.
అసౌకార్యాలతో భక్తులకు తప్పని ఇక్కట్లు
నరసింహుని దర్శనార్ధం అనేక ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివస్తున్నా.. కొండపై కనీస మౌలిక వసతులు లేకపోవడంతో ఇబ్బందులుపడ్డారు. కొండపైకి ఉచిత బస్సులు ఏర్పాటుచేసినా.. మండుతున్న ఎండలకు భక్తులకు కనీసం నీడ లేకుండా పోయింది. ఆలయ సందర్శనలో సరైన సూచిక బోర్డులులేక ఏటు వెళ్లలో తెలియక భక్తులు ఎదుర్కొన్నారు. స్వామివారి దర్శనార్ధం కొంపైకి చేరుకున్న భక్తులకు కనీసం తాగునీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడ్డారు. పిల్లాపాలతో స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు క్యూలైన్లలో ఆగచాట్లు ఎదుర్కొన్నారు.
ఈవో వైఖరిపై స్థానికుల ధర్నా
యాదాద్రి ఈవో ఇష్టానుసారం వ్యవహారిస్తూ భక్తులు, స్థానికుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారంటూ స్థానికులు, యువత, ఆటో డ్రైవర్లు, రాజకీయ పార్టీల నేతలు ధర్నా చేశారు. అదివారం యాదగిరిగుట్ట పాతగుట్ట చౌరస్తాలో జరిగిన ధర్నాలో పలువురు మాట్లాడుతూ ఆలయ పునః ప్రారంభం తర్వాత ఈవో ఒంటెద్దు పోకడతో ముందకువెళుతున్నారని మండిపడ్డారు. కోట్లాది రూపాయలను ఖర్చుచేసి ఆలయ నిర్మాణంచేపడితే ఈవో తన ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటూ భక్తులు, స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఆలయానికి వచ్చే భక్తులను ఆటోల ద్వారా కొండపైకి చేరవేసే ఆటోలను కొండపైకి వెళ్లనివ్వకుండా ఈవో అడ్డుపడుతున్నారన్నారు. కొండపైకి ఆర్టీసీ బస్సులకు అనుమతిస్తూ, ద్విచక్ర వాహనంతోపాటు ఎటువంటి వాహనాలు అనుమతి లేకపోవడంతో భక్తులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల కార్లను కొండపైకి అనుమతిస్తున్నారని వారన్నారు. ధర్నాతో ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దాంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టుచేశారు. ఆందోళనలో పట్టణ యవకులు, టిఆర్‌ఎస్, సిపిఐ, కాంగ్రెస్, బిజెపి నాయకులతోపాటు, ప్రజాప్రతినిదులు తదితరులు పాల్గొన్నారు.

Huge Devotees visit Yadadri Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News