- Advertisement -
న్యూఢిల్లీ : విద్వేష వ్యాఖ్యలు చేసిన యతి నర్సింగానంద్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఢిల్లీలో ఆదివారం జరిగిన హిందూ మహాపంచాయత్‌లో ఆధ్యాత్మిక నేత యతి నర్సింగానంద్ మాట్లాడుతూ ముస్లిం నేత భారత ప్రధాని అయితే 50 శాతం హిందువులు మతం మార్చుతారని, 40 శాతం మందిని చంపేస్తారని , పదిశాతం హిందువులు దేశం విడిచి వెళ్లి పోయేలా చేస్తారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విద్వేష పూరిత ఈ వ్యాఖ్యలు చేసినందుకు వివిధ సెక్షన్ల కింద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. 2021 డిసెంబర్‌లో హరిద్వార్‌లో ధర్మసంసద్‌లో ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను అరెస్టు చేసి తరువాత బెయిలుపై విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం ఆయన వ్యాఖ్యలు వీడియో, సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
- Advertisement -