Monday, December 23, 2024

సినీదర్శకుడు త్రివిక్రమ్ కారుకు జరిమానా

- Advertisement -
- Advertisement -

బ్లాక్ ఫిల్మ్‌తో తిరుగుతున్న దర్శకుడు

 

మనతెలంగాణ, సిటిబ్యూరో: కారుకు బ్లాక్ ఫిల్మ్ వేసుకుని తిరుగుతున్న సినీ దర్శకుడు త్రివిక్రమ్ కారుకు హైదరాబాద్ పోలీసులు జరిమానా విధించారు. ట్రాఫిక్ పోలీసులు జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో సోమవారం వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినీదర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కారులో రాగా పోలీసులు ఆపారు. ఆయన కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించి జరిమానా విధించారు. ఆ సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కారులో ఉన్నారు. వాహనాలనకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ తొలగించాలని పోలీసులు గత కొంత కాలం నుంచి ప్రచారం నిర్వహిస్తున్నారు. తనిఖీలు చేపట్టిన పోలీసులు బ్లాక్ ఫిల్మ్ ఉన్న వాహనాలను ఆపి ఫిల్మ్ తొలగించడమే కాకుండా జరిమానా విధిస్తున్నారు. ఇటీవలి కాలంలో మంచు మనోజ్, ఎన్టిఆర్, అల్లు అర్జున్, కల్యాణ్‌రామ్ కార్లకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌లను తొలగించిన పోలీసులు జరిమానా విధించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News