Friday, November 15, 2024

కెటిఆర్ వర్సెస్ డికె…. బెస్ట్ సిటీ హైదరాబాదా? బెంగళూరా?

- Advertisement -
- Advertisement -

బెస్ట్ సిటీ హైదరాబాదా? బెంగళూరా?
పరస్పర సవాళ్లు, ఛాలెంజ్‌లు స్వీకరణ
ఆసక్తి రేపిన ఇరువురి ట్విట్టర్ సంభాషణ

KTR vs DK Shiva kumar tweets

 

మన తెలంగాణ/హైదరాబాద్: ఐటి సేవల రంగంలో ప్రస్తుతం ఇండియాలో బెంగళూరు, హైదరాబాద్ నగరాలు టాప్‌లో ఉన్న సంగతి విదితమే. భవిష్యత్తులో హైదరాబాద్ ఐటీ రంగాన్ని బెంగళూరు కన్నా మిన్నగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ విషయంలో ఏ చిన్న అవకాశం దొరికినా దానిని సద్వినియోగం చేసుకునేందుకు ఐటి మంత్రి కెటిఆర్ కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరును వీడాలనుకునే కంపెనీలకు హైదరాబాద్‌కు ఆహ్వానిస్తున్నారు. సోమవారం ట్విట్టర్‌లో ఆసక్తికర పరిణామం ఎదురైంది. టెక్ ఎంట్రప్రెన్యూయర్లకు టాప్ సిటీ హైదరాబాద్? బెంగళూరా? అనే చర్చ జరిగింది. అంతేకాదు, పరస్పరం సవాళ్లు చేసుకుని అంగీకరించారు కూడా. ఆ చర్చ ఇలా సాగింది.

ఇటీవల ప్రముఖ స్టార్టప్ సంస్థ హౌజింగ్ డాట్ కామ్, ఖాతాబుక్ స్టార్టప్‌ల సిఇఒ రవీష్ నరేష్ చేసిన ట్వీట్ కెటిఆర్‌శివకుమార్ మధ్య ఈ సంభాషణకు దారితీసింది. బెంగళూరులో మౌలిక సదుపాయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రవీష్ ట్వీట్ చేయగా దానిపై కెటిఆర్ స్పందించారు. మొదట రవీష్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ‘బెంగళూరులోని కోరమంగల/హెచ్‌ఎస్‌ఆర్‌లోని స్టార్టప్ కంపెనీలు ఇప్పటికే ట్యాక్సుల రూపంలో బిలియన్ డాలర్లను వెచ్చిస్తున్నాయి. అయినప్పటికీ ఇక్కడి రోడ్లు ఏమాత్రం బాగా లేవు. పైగా ప్రతీ రోజూ పవర్‌కట్స్, వాటర్ సప్లై కూడా బాగా లేదు. ఉన్న పుట్‌పాత్‌లను ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా ఉన్నాయి. ఒక రకంగా చాలావరకు గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇండియాన్ సిలికాన్ వ్యాలీ కన్నా మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి’ అని పేర్కొన్నారు. రవీష్ ట్వీట్‌పై స్పందించిన కెటిఆర్.. ‘మీ బ్యాగ్స్ సర్దేసుకుని ఇక హైదరాబాద్ వచ్చేయండి. మా దగ్గర మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అత్యుత్తమ ఎయిర్‌పోర్ట్‌లలో మా ఎయిర్‌పోర్టు ఒకటి. నగరం లోపలికి, వెలుపలికి రాకపోకలు సాగించడం కూడా చాలా సులువు’ అని పేర్కొన్నారు. ఇదే ట్వీట్‌పై కర్ణాటక పిసిసి చీఫ్ డికె శివకుమార్ స్పందించారు.

‘కెటిఆర్.. మై ఫ్రెండ్.. నేను నీ ఛాలెంజ్ స్వీకరిస్తున్నా, 2023 చివరి నాటికి కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అప్పుడు బెంగళూరు ప్రభను మళ్లీ నిలబెట్టి ఇండియాలోనే బెస్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం’ అని డికె పేర్కొన్నారు. డికె ట్వీట్‌పై కెటిఆర్ స్పందిస్తూ.. ‘అన్నా నాకు కర్ణాటక రాజకీయాల గురించి.. అక్కడ ఎవరు గెలుస్తారనే దానిపై అంతగా అవగాహన లేదు. అయితే మీ ఛాలెంజ్ మాత్రం స్వీకరిస్తున్నా.. హైదరాబాద్, బెంగళూరు నగరాలు ఆరోగ్యకర పోటీ వాతావరణంతో యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ. దేశాభివృద్ధికి ముందుకు సాగాలి. కాబట్టి హలాల్, హిజాబ్ వంటి వాటిపై కాకుండా మౌలిక సదుపాయాలపై ఫోకస్ పెడుదాం. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఇప్పుడు హైదరాబాద్ ఓ గ్లోబల్ సెంటర్. మేటి ఐటి కంపెనీలకు తెలంగాణ సర్కార్ కల్పిస్తున్న సౌకర్యాలతో హైదరాబాద్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. నిజానికి ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరే. ఇండియన్ సిలికాన్ వ్యాలీ అనేవారు కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న పరిణామాలు, హైదరాబాద్‌ను ఐటి సిటీగా మార్చాశాయ’ని పేర్కొన్నారు. ఈ ఇద్దరి మధ్య సంభాషణ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News