- Advertisement -
జమ్ము : జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్దనున్న గ్రామంలో ఉగ్రవాద స్థావరాన్ని భద్రతా బలగాలు కనుగొని భారీ ఎత్తున ఆయుధాలను, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకోగలిగారు. రక్షణ దళాల అధికార ప్రతినిధి సోమవారం ఈ వివరాలు వెల్లడించారు. హవేలీ తహశీల్ పరిధి లోని నూర్‌కోట్ గ్రామంలో ఆదివారం బాగా పొద్దు పోయిన తరువాత ఆర్మీ, పోలీస్ సంయుక్త ఆపరేషన్‌లో రెండు ఎకె 47 రైఫిళ్లు, రెండు మ్యాగజైన్లు, 20 తూటాలు, ఒక 223 బోర్ ఎకె షేప్ గన్, చైనీ పిస్టల్, మరికొన్ని తూటాలు లభ్యమయ్యాయని పేర్కొన్నారు. పాకిస్థాన్ పేరు చెప్పకుండా శాంతికి భంగం కలిగించడానికి శత్రువులు పన్నిన పన్నాగం భద్రతాదళాల అప్రమత్తతతో మరోసారి భగ్నం అయినట్టు ఆ అధికార ప్రతినిధి వెల్లడించారు.
- Advertisement -