Monday, December 23, 2024

సరైన టీకా వల్లనే దేశంలో తక్కువ కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Fewer corona cases in country due to proper vaccination

 

పుణె : దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు తక్కువగా ఉండడానికి సరైన టీకాను ఎంచుకోవడమే కారణమని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఇఒ అధర్ పూనావాలా సోమవారం వెల్లడించారు. అమెరికా, యూరప్ వంటి ఇతర దేశాల్లో వినియోగిస్తున్న వ్యాక్సిన్లు కన్నా మన దేశంలో మన వ్యాక్సిన్లు చాలా ఉత్తమమైనవని రుజువైందని ఆయా దేశాల్లో చాలా ఎక్కువగా కేసులు పెరుగుతుండగా, మనదేశంలో చాలా తక్కువగా కేసులు ఉంటున్నాయని, దీనికి కారణం సరైన వ్యాక్సిన్లును మనం ఎంచుకోవడమేనని వివరించారు. ప్రత్యామ్నాయ ఇంధనం అనే అంశంపై సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఒకవేళ నాలుగో వేవ్ సంభవిస్తే అది చాలా మాంద్యంగా ఉంటుందన్నారు.

బూస్టర్ డోసు గురించి మాట్లాడుతూ ఎవరైతే విదేశాలకు పర్యటిస్తారో వారికి బూస్టర్ డోసు తప్పనిసరి అని, అందువల్ల ప్రతివారికి బూస్టర్ డోసు ఇవ్వడానికి అనుమతించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని, దీనిపై ప్రభుత్వం అంతర్గతంగా చర్చిస్తోందని, త్వరలో బూస్టర్ డోసుపై ఒక విధానం వెలువడుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. ఇతర దేశాలు బూస్టర్ డోసును వినియోగిస్తున్నాయని, భారత్ కూడా దీని గురించి ఆలోచించవలసిన సమయం వచ్చిందని చెప్పారు. అర్హులైన వయోజనులందరికీ చాలావరకు రెండు డోసులు అందించడంలో కేంద్రం అద్భుతంగా పనిచేసిందని ప్రశంసించారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న వ్యాక్సిన్లు కొత్త వేరియంట్లను కట్టడి చేయగలవా అని ప్రశ్నించగా, బూస్టర్ డోసు తీసుకుంటేనే అవి పనిచేయగలవని వివరించారు. భవిష్యత్తులో వచ్చే వేరియంట్ల నుంచి కూడా రక్షణ కలుగుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News