Monday, December 23, 2024

భార్యను హత్య చేసిన నిందితుడికి 10 ఏళ్ల జైలు

- Advertisement -
- Advertisement -

Accused of murdering wife sentenced to 10 years in prison

 

హైదరాబాద్ : భార్యను హత్య చేసిన నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ.10,000 జరిమానా విధిస్తూ ఎల్‌బి నగర్ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. రంగారెడ్డి జిల్లా, బాలాపూర్ మండలం, జల్‌పల్లికి చెందిన సమ్రీన్ ఫాతిమాను షాహిన్‌నగర్‌కు చెందిన సయిద్ నవీద్‌తో వివాహం చేశారు. వీరికి ఒక బాబు ఉన్నాడు, సయిద్ నవీన్ కల్లుకు బానిసగా మారాడు. అక్టోబర్ 22, 2016లో సయిద్ నవీద్ కల్లుతాగి ఇంటికి వచ్చాడు. ఇంటి ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వడంలేదని సమ్రీన్ నిలదీసింది. దీంతో తన పర్సు నుంచి డబ్బులు తీశావని సమ్రీన్‌తో నిందితుడు గొడవపడ్డాడు. ఆవేశంతో నిందితుడు బాధితురాలిని రోకలిబండతో కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బాలాపూర్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ వివి చలపతి సాక్షాలను కోర్టులో ప్రవేశపెట్టారు. వాటిని పరిశీలించిన కోర్టు నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News